👉ఫిబ్రవరి 2న ఎలక్షన్ కోడ్ ?
👉3 కోట్ల 69 లక్షల మంది ఓటర్లు .
J. SURENDER KUMAR
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. 2024 మార్చి 6న ఎన్నికల జరిగే అవకాశం ఉందని సమాచారం. మార్చి 2 న కోడ్ ప్రకటించే అవకాశం ఉంది.
ఈ నేపద్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు. ఏపీలో విమర్శలు ప్రతి విమర్శలు మధ్య ఎన్నికల సంఘం నూతన ఓటర్ల లిస్టు తయారుచేసింది. తన కార్యక్రమాలు ముమ్మరం చేసింది.
ఓ వైపు ఈవీఎం ల మీద అవగాహన కల్పిస్తూ, మరో వైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలెట్టింది.
ఇక తాజాగా ఏపీలో వున్న ఓటర్ల సంఖ్యని ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఇక ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏపీలో సుమారు 3 కోట్ల 69 లక్షల 33 వేల 91 మంది ఓటర్లు వున్నట్లు తెలుస్తుంది.
ఇక ఇందులో పురుషుల ఓటర్లు 1,83,24,588 మంది వుండగా, మహిళలు 1,86,04,742 మంది వున్నారని తెలుస్తుంది, ఇక థర్డ్ జెండర్ ఓటర్స్ 3,761 మంది వున్నారని ఎన్నికల సంఘం లెక్కల్లో పేర్కొంది. ఇక రాష్ట్రంలో అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లు వుండగా, అత్యల్పంగా నర్సాపురం నియోజకవర్గంలో వున్నారని ఎన్నికల సంఘం నిర్ధారించింది.
ఎన్నికల సంఘం అధికారికంగా పోలింగ్ తేదీలు ప్రకటించాల్సి ఉంది.