అంగరంగ వైభవంగా శ్రీ గోదా కల్యాణం !

J.SURENDER KUMAR,

పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం ఆండాళ్ శ్రీ గోదా కల్యాణం వైభవంగా జరిగింది.

ధనుర్మాసం సందర్భంగా టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశంలోని 216 కేంద్రాల్లో నెల రోజుల పాటు ప్రముఖ పండితులచే తిరుప్పావై ఉపన్యాసాలను అందించారు.ఈ సందర్భంగా డాక్టర్ ద్వారం లక్ష్మి పాశురాలను రాగయుక్తంగా ఆలపించారు. అదేవిధంగా తిరుపతికి చెందిన కుమారి భానుజ బృందం నిర్వహించిన నృత్య కార్యక్రమం ఆకట్టుకుంది.తిరుపతికి చెందిన ప్రముఖ పండితుడు శ్రీ చక్రవర్తి రంగనాథన్ తిరుప్పావై ప్రవచనాలను అందించారు.

టీటీడీ ఎఫ్ఏసీఏవో  బాలాజీ, ధార్మిక ప్రాజెక్టుల ఏఈవో . శ్రీరాములు, సూపరింటెండెంట్  రామచంద్ర, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్  ఈ కార్యక్రమంలో పురుషోత్తం, భక్తులు పాల్గొన్నారు.