ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలను పథకాలను ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తామని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.
వెల్గటూర్ మండలం వెంకటాపూర్ లో గురువారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజలు సద్వినియోగం

చేసుకోవాలని, దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ధరఖాస్తు చేసుకునే వారు సంబంధిత పత్రాలను అధికారులకు సమర్పించాలని,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో, ఎమ్మార్వో రాందేని రమా కోటయ్య, ఉప సర్పంచ్ స్వామి మరియు వార్డు సభ్యులు గ్రామ శాఖ అధ్యక్షులు తిరుపతి రాజేందర్ కాంగ్రెస్ కార్యకర్తలు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ…

ధర్మారం పట్టణానికి చెందిన ఎలగందుల రాజేశం అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందారు. లక్ష్మణ్ కుమార్ గురువారం మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి సానుభూతి తెలిపారు..