ఆత్మవిశ్వాసం నింపేందుకే క్రీడలు !

👉జడ్జి శ్యాం ప్రసాద్ !

J.SURENDER KUMAR,

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధర్మపురి కోర్టు ఆవరణలో గురువారం న్యాయవాదులకు స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ జడ్జి శ్యాం ప్రసాద్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.రాజేష్ ప్రారంభించారు.


ఈ సదర్భంగా జడ్జి శ్యాం ప్రసాద్ మాట్లాడుతు
న్యాయవాదులకు క్రీడలు ఉపశమనం కలిగిస్తాయన్నారు. క్రీడలలో పాల్గొనే ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్‌ను టీమ్‌ వర్క్‌గా, పాజిటివ్‌గా తీసుకోవాలన్నారు. క్రీడల్లో నైపుణ్యం ఉంటే మానసిక ఒత్తిడి నుంచి తట్టుకుంటారన్నారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గడ్డం సత్యనారాయణ రెడ్డి, గడ్డం లింగ రెడ్డి, రౌతు రాజేష్, అలుక వినోద్, బందెల రమేష్, మమిడాల శ్రీకాంత్ , రామడుగు రాజేష్, గుడ జితేందర్ రెడ్డి, సంబరాజుల కార్తిక్ , జాజాల రమేష్, కరువత్తుల భావన, బత్తిని ఇంద్రకరణ్ కస్తురి శరత్, కలమడుగు కీర్తి క్రీడా పోటీలలో పాల్గొన్నారు