అయోధ్య కోసం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం సిద్ధం!

👉లక్ష లడ్డులు  రవాణా కు సిద్ధం!

J.SURENDER KUMAR,

జనవరి 22న శ్రీరామమదిరంలో జరిగే విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అయోధ్యలో శ్రీవారి ప్రసాదంగా లడ్డూల పంపిణీకి 25 గ్రాముల లక్ష లడ్డూలను పంపించేందుకు టీటీడీ సిద్ధమైంది.


తిరుమలలోని సేవా సదన్ -1లో దాదాపు 350 మంది శ్రీవారి సేవకులు ఈ దివ్య కార్యక్రమంలో నిమగ్నమై ఒక్కో ప్యాకెట్‌లో రెండు లడ్డూలను 350 పెట్టెల్లో, ఒక్కో పెట్టెలో 150 ప్యాకెట్లు తీసుకెళ్లే విధంగా ప్యాకింగ్ చేశారు.


డీఈవో (జనరల్) శ్రీ శివప్రసాద్, పోటు ఏఈవో శ్రీ శ్రీనివాసులు, ఇతర సిబ్బంది పర్యవేక్షణలో జరిగింది.