👉తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో..SVBC లో
👉శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో..
👉సోమవారం ఉదయం 11:30 నుండి..
J.SURENDER KUMAR,
జనవరి 22న (సోమవారం) ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది.
ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ తమ తమిళ, కన్నడ, హిందీ చానెళ్లతోపాటు ఎస్వీబీసీ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో అయోధ్య ఆలయంలో వైదిక, ఆధ్యాత్మిక క్రతువులను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
మధ్యాహ్నం 12 గంటల వరకు అయోధ్యలో జరిగే పవిత్రోత్సవ కార్యక్రమాలను SVBC తెలుగు ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరుమల శ్రీవారి కల్యాణం యథావిధిగా ప్రత్యక్ష ప్రసారం కానుంది.
అనంతరం అయోధ్యలో కల్యాణం, కార్యక్రమాలు కొనసాగుతాయి.
భక్తులు ఈ విషయాలను గమనించి అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని SVBC తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఛానెళ్లలో వీక్షించి దైవానుగ్రహం పొందాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో భక్తులకు విజ్ఞప్తి చేసింది.