👉సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ
J. SURENDER KUMAR,
శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాద్' పేరుతో మిఠాయిల విక్రయానికి సంబంధించి "మోసపూరిత వ్యాపార పద్ధతుల"కు పాల్పడుతోందని ఆరోపిస్తూ కేంద్రం ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు నోటీసు జారీ చేసింది అయోధ్యలో రామ మందిరం పూర్తి కాకున్నా "ప్రసాదం" పేరుతో స్వీట్లను విక్రయిస్తూ అమెజాన్ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) చేసిన ఫిర్యాదుకు కేంద్రం స్పందించింది.

సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA)
“ఆహార ఉత్పత్తుల విక్రయాన్ని ఆన్‌లైన్‌లో ప్రారంభించడం ద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టించాయి అనినోటీసులో పేర్కొంది.
అమెజాన్ ప్లాట్‌ఫారమ్ జాబితాలో చేయబడిన నిర్దిష్ట ఉత్పత్తులలో ‘శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాద్ – రఘుపతి నెయ్యి లాడూ, అయోధ్య రామ మందిర్ అయోధ్య ప్రసాద్, ఖోయా ఖోబీ లడూ, రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్ – దేశీ ఆవు మిల్క్ పెడా,’ వంటివి ఉన్నాయి.
CCPA జారీ చేసిన నోటీసుకు వివరణ ఇవ్వడానికి అమెజాన్‌కు ఏడు రోజుల గడువు ఇచ్చింది. లేని పక్షంలో వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని నిబంధనల ప్రకారం కంపెనీపై అవసరమైన చర్యలు చేపట్టనున్నట్టు నోటీసులో పేర్కొంది.