బీఆర్ఎస్ అభిమాన పోలీస్ అధికారులకు బదిలీ షాక్!

👉ధర్మపురి, మల్యాల సిఐ ల పై బదిలీ వేటు !

👉ధర్మపురికి మంథని సీఐ సతీష్ !

👉ఎన్నికలఎఫెక్ట్ ? ఎమ్మెల్యే ఎఫెక్ట్ ?

J.SURENDER KUMAR,

శుక్రవారం పోలీసు శాఖ ఉన్నతాధికారులు బదిలీ చేసిన 13 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్ లలో ధర్మపురి, మల్యాల సిఐలు ఉన్నారు. ధర్మపురికి మంథని సీఐ సతీష్ ను ధర్మపురికి బదిలీ చేశారు. ధర్మపురి, మల్యాల సిఐల బదిలీకి ఎన్నికల కమిషన్ చేసిన సిఫారసు ఎఫెక్ట్ ? లేదా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, వీరి బదిలీ కోసం ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారా ? అనే అంశంలో స్పష్టత లేదు.

అయితే ఎన్నికల సందర్భంలో ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లు మల్యాల పోలీస్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సీఐ బిల్లా కోటేశ్వర్ టిఆర్ఎస్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నాడనే ఆరోపణల తోపాటు, అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఎన్నికల కమిషన్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు, మీడియా సమావేశంలో ఆయన మల్యాల సిఐ పై పలు ఆరోపణలు చేశారు.

గతంలో ధర్మపురి సీఐగా విధులు నిర్వహించిన కోటేశ్వర్,. రాజకీయ పలుకుబడితో ఇదే జిల్లాలో మల్యాల సర్కిల్ కు పోస్టింగ్ ఇప్పించుకొని. ధర్మపురి , రాయపట్నం, బూరుగుపల్లి, గ్రామాలలో కొందరికి ఫోన్లు చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు ప్రచారం చేయాలని ఫోన్ చేస్తూ బెదిరిస్తున్నాడని నాడు లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో ఆరోపణలు చేశారు. ధర్మపురి సీఐగా విధులు నిర్వహిస్తున్న రమణమూర్తి, సైతం బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం సహకరిస్తున్నాడని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ మీడియా సమావేశంలో ఆరోపించారు.

ధర్మపురి సిఐ సతీష్ !

ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి నాటి టిపిసిసి అధ్యక్షుడు ధర్మపురిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ ఎన్నికల కమిషన్ కు సభకు హాజరై వారి వివరాలు సువిధ యాప్ లో ముందస్తుగా పేర్కొనవలసి ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి సభ ముగిసిన మరుసటి రోజు ఈ సభ లో నిబంధన ఉల్లంఘించారంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాల్సిందిగా బీఆర్ఎస్ శ్రేణులను సీఐ ప్రోత్సహించినట్టు. తదితర ఆరోపణలతో ఎన్నికల సమయంలో ఫిర్యాదు చేశారు. ఫలితాలు తారుమారు కావడంతో పాటు లక్ష్మణ్ కుమార్ విజయం సాధించడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తన ఓటమికి బదిలీ అయిన అధికారితోపాటు స్థానిక పోలీస్ అధికారి, కొందరు ఎస్సైలు చేపట్టిన చర్యలను వివరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోని బదిలీలు జరిగాయన్న చర్చ నెలకొంది.
ఇది ఇలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో
బీఆర్ఎస్ పార్టీకి నమ్మిన బంట్లుగా పనిచేసిన పోలీస్ అధికారుల వివరాలు ఆ ప్రాంత నాయకులకు ఇచ్చిన ఎన్నికల ఫండింగ్ వివరాలను నిఘా విభాగాల ద్వారా ప్రభుత్వం సేకరించినట్టు సమాచారం.