చట్టసభలలో తెలంగాణ ప్రతినిధులు ఎంపీ ఎమ్మెల్యేలపై 202 కేసులు పెండింగ్!

👉 2023 డిసెంబర్ 31 నాటికి..

J.SURENDER KUMAR,

చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజా సంక్షేమం కోసం చట్టాలను రూపకల్పన చేసే తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలపై వివిధ సందర్భాల్లో వారిపై నమోదైన కేసులు 24 జిల్లాలలో మొత్తం కలుపుకొని 2023 డిసెంబర్ 31 నాటికి 202 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.

వివరాలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్ MSJ కోర్టులో 79, CBI కోర్టులో 29, అత్యధిక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 27 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
ఇందులో ప్రికాగ్నిజన్స్ 27, సుమన్సు జారి అయినవి 91, నిందితులు హాజరైన కేసులు 10 , Furnishing of Sureties 11, ఎగ్జామింగ్ 16, డిశ్చార్జి పిటిషన్ పెండింగ్ 20, చార్జెస్ 2, ట్రయల్ 10, ఆర్గుమెంట్స్ 2, నాన్ బెిలబుల్ వారెంట్స్ జారీ 3, స్టే లో ఉన్నవి 10 కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా…

ఆదిలాబాద్ లో 7, హనుమకొండలో 5,
హైదరాబాద్ MSJ కోర్టులో 79, CBI కోర్టులో 29, జగిత్యాలలో 4, జయశంకర్ భూపాల్ పల్లి లో 2, కరీంనగర్ 19, ఖమ్మం, 1, మహబూబాబాద్ 2, మహబూబ్ నగర్ 5, మంచిర్యాల్ 5, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి, 1, నాగర్ కర్నూల్ 5, నారాయణపేట 2, నిర్మల్ 7, నిజామాబాద్ 7, పెద్దపల్లి 1, రాజన్న సిరిసిల్ల 3, రంగారెడ్డి జిల్లా 8, సంగారెడ్డి, 2, సిద్దిపేట్ 2, సూర్యాపేట, 3, వనపర్తి 1, కేసులు పెండింగ్ లో ఉన్నాయి.