👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గ పరిధి లోని రాయపట్నం బూరుగుపల్లి, తిమ్మాపూర్ , దొంతపూర్ ఆరేపల్లి , జైన, దమ్మన్నపేట, పాషిగామ, తాళ్ల కొత్తపేట, వెలుగటూర్ శేగ్యం, రాజారాం పల్లె, నంది మేడారం తదితర గోదావరి తీరం చివరి ఆయకట్టు భూములకు పంటలు ఎండిపోకుండా సాగునీరు అందిస్తామని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ఇరిగేషన్ అధికారులతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తిమ్మాపూర్, కమలాపూర్, రాయపట్నం గ్రామాలలో సాగునీటి కాలువలను ఆయన పరిశీలించారు.
D 53, D64, D83-A D83-B నందిమేడారం D-63,D-65,D-67 టెలాండ్ వరకు ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా చర్యలు చేపట్టనున్నట్టు రైతులకు వివరించారు.

ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని బోల్ చెరువు బంధం కు సంబందించిన 2 ఎల్ కేనాల్ ను పరిశీలించారు. ముందుగా తిమ్మాపూర్ లోని స్థానిక ఎల్లమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.

గత కొద్ది రోజులుగా బోల్ చెరువు నుండి కెనాల్స్ ద్వారా ఇక్కడి ప్రాంత రైతాంగానికి నీరు అందించే సౌకర్యం ఉండేదని కానీ గత ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అట్టి కెనాల్ లో పిచ్చి మొక్కలు పెరిగి, చెత్త చెదారం చేరి నీరు అందడం లేదని ఆరోపించారు. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు గండిపడి రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురికావడం జరిగిందనీ,ఇట్టి విషయం పై.ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ని కలిసి పరిస్థితి వివరించినట్లు తెలిపారు. సీఎం స్పందించి విచారణ జరిపించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజక వర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫియొద్ధిన్, ధర్మపురి మండల యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల హరీష్ గౌడ్, నలుమసు వైకుంఠం, బొండ్ల పోచమల్లు, బొమ్మకంటి సంతోష్, తోడేటి ప్రకాష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు