చుక్క గంగారెడ్డి కి “సేవారత్న” నేషనల్ అవార్డ్!

👉ఫిబ్రవరి 11న తిరుపతిలో అవార్డ్ ప్రధానం!

👉ఎంపిక పత్రాన్ని అందజేసిన జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ!

J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాకు చెందిన ఉద్యమకారుడు, జర్నలిస్ట్, హక్కుల సాధన యోధుడు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డికి “సేవారత్న” నేషనల్ అవార్డ్ – 2024 కు ఎంపికయ్యారు.

గంగారెడ్డి సేవలను, ఉద్యమాలను, వాటి ఫలితాలను బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ ఆప్ ఇండియా గుర్తించి, ఎంపిక పత్రాన్ని జారీ చేసింది. ఆదివారం సాయంత్రం హైదరబాద్ లోని జాతీయ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డ్ సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ “సేవారత్న” నేషనల్ అవార్డ్ కు ఎంపికైన పత్రాన్ని చుక్క గంగారెడ్డి కి అందజేసి, అభినందించారు.
ఫిబ్రవరి 11న ఆంధ్ర ప్రదేశ్ తిరుపతిలో నిర్వహించే బహుజన రైటర్స్ 7వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా “సేవా రత్న నేషనల్ అవార్డ్” ను అందజేయనున్నట్లు నల్లా రాధాకృష్ణ ప్రకటనలో వెల్లడించారు.

అవార్డ్ సెలక్షన్ కమిటీ మెంబర్ తాల్లపెల్లి సురేందర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సూచనలతో ఉద్యమ సేవలను, వాటి ఫలితాలను పరిశీలించిన అనంతరం అవార్డ్ కు ఎంపిక చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
సౌత్ ఇండియా లోని ఆరు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల నుండి సుమారుగా 600 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కి హాజరు అవుతారని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ తో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యం.యం. గౌతమ్, రాష్ట్ర కో – ఆర్డినేటర్ హనుమాండ్ల విష్ణు తదితరులు పాల్గొన్నారు.