J.SURENDER KUMAR,
ధర్మపురి మండలం నేరెళ్ళ గ్రామంలో శ్రీ సాంబశివ దేవస్థాన క్యాలెండర్ ను స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, సతీమణి కాంత కుమారి సోమవారం ఆవిష్కరించారు. ఆలయ వార్షికోత్సవ సందర్భంగా న్యాయవాది జాజాల రమేష్, రూపొందించిన శ్రీ సాంబశివ దేవస్థానం 2024 క్యాలెండర్, డైరిని వేద పండితులు శివ శ్రీ ప్రశాంత్ శాస్త్రి స్వామి వారి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు.

క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే అడ్లురి లక్ష్మణ్ కుమార్ సతీమణి అడ్లురి కాంత కుమారి స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం కమిటీ సభ్యులు వారిని శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కసారపు రాజగౌడ్, గోవిందుపల్లే సర్పంచి పురంశెట్టి రాజయ్య, ఎంపీటీసీ రెడ్డవేని సత్యం, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు కాశెట్టి మల్లేశం, బొంతల సత్యనారాయణ, సహకర సంఘం వైస్ చైర్మన్ శేర్ల రాజేశం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ జంగిలి తిరుపతి, నేరెళ్ళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసరపు బాలగౌడ్, గోవిందుపల్లే అధ్యక్షుడు పురంశెట్టి మల్లేశం, అరబిందో పాఠశాల అధినేత జాజాల రవీందర్, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గన్నారు.