J.SURENDER KUMAR,
ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని బుధవారం హైదరాబాదులో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎం తో పాటు ఐటి, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ను, రవాణా మరియు బీసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖ మంత్రి. శ్రీమతి కొండ సురేఖ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గానికి తాగు,సాగు నీరును శాశ్వత ప్రాతిపదికగా అందించే అంశంతో పాటు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను సీఎంతో పాటు మంత్రులకు వివరించారు. ధర్మపురినీ టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని, ధర్మపురి

నియోజకవర్గంలోని పలు గ్రామాలకు ఆర్టీసి బస్సుల సౌకర్యం గత ప్రభుత్వం కల్పించక పోవడంతో, ప్రజలు మండలం స్థాయి పనులకు, జిల్లా స్థాయి పనులకు, హాస్పిటల్ కు మరియు వ్యాపారం చేసుకొనుటకు చాలా ఇబ్బందులకు గురైన్నారనీ కావునా మన ప్రభుత్వం లో నా నియోజకవర్గ ప్రజలకు బస్సులు కొరత లేకుండా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.
ఈ నెల 18 నుంచి ధర్మపురిలో వేద మహాసభలు.!

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లో
ఈనెల 18 జనవరి నుంచి 24 జనవరి వరకు జరిగే శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామీ వేద పారాయణం మరియు వేద మహాసభల కార్యక్రమలు నిర్వహణకు నిధుల కోసం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వినతిపత్రాన్ని అందజేశారు.
రామగుండం శాసన సభ్యులు రాజ్ ఠాకుర్ మక్కన్ సింగ్ తదితరులు ఉన్నారు.