👉జ్యూరిచ్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో దావోస్
J.SURENDER KUMAR,
దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం రేవంత్రెడ్డి బృందం సోమవారం జ్యూరిచ్ కు మధ్యాహ్నం చేరుకుంది.
ప్రవాస భారతీయులు వారికి ఘన స్వాగతం పలికారు.

ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్రానికి సంబంధించిన పెవిలియన్లో త్వరలో ‘తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి’ అనే ప్రచారం ప్రారంభిస్తామని సీఎం తెలిపారు.

సమగ్ర అభివృద్ధితో కూడిన సరికొత్త తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ప్రవాస భారతీయ ప్రముఖులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం మధ్యాహ్నం జ్యూరిచ్ చేరుకున్నారు. జ్యూరిచ్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో దావోస్ వెళ్లారు.

దావోస్ కు ప్రయాణం అవ్వడానికి ముందు గా విమానాశ్రయంలో పలువురు భారతీయ ప్రముఖులను కలిసి కొద్దిసేపు మాట్లాడటం చాలా సంతోషానిచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్రానికి సంబంధించిన పెవిలియన్లో త్వరలో ‘తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి’ అనే ప్రచారం ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. దావోస్లో పలు అత్యున్నత స్థాయి వరస సమావేశాలు ఉంటాయని రేవంత్ రెడ్డి తెలిపారు.