సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో మంద భీంరెడ్డి !

J.SURENDER KUMAR,

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ (ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సమావేశం) లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సోమవారం జురిక్ విమానాశ్రయానికి చేరిన సందర్బంగా స్విట్జర్లాండ్ లోని తెలుగు ప్రవాసులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జగిత్యాలకు చెందిన వలస వ్యవహారల విశ్లేషకులు, టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. 
స్విట్జర్లాండ్ లోని జెనీవాలో లో ఈనెల 21 నుంచి 25 వరకు జరిగే గ్లోబల్ ఫోరం ఆన్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ (వలసలు, అభివృద్ధి గురించి ప్రపంచ వేదిక) సదస్సులో తాను పాల్గొంటానని మంద భీంరెడ్డి తెలిపారు.