సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!

J.SURENDER KUMAR,

ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం శాసనసభ్యులకు ₹10 కోట్లు మంజూరు చేసిన సందర్భంలో కలిసి నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం, తాగు, సాగు నీటి సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం అందజేశారు.
ప్రత్యేకంగా ధర్మపురి క్షేత్రంను టెంపుల్ సిటీగా అభివృద్ధి అంశంపై ఎమ్మెల్యే సీఎం కు వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు.