సీఎం రేవంత్ రెడ్డిని ఆశీర్వదించిన అర్చకులు వేద పండితులు !

👉నూతన సంవత్సర సందర్భంగా..

👉సీఎం కార్యాలయ ప్రకటనలో..

J. SURENDER KUMAR,

నూతన సంవత్సరం మొదటిరోజున సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడిపారు.. మంత్రులు, ఐఏఎస్ అధికారులు సినీ ప్రముఖులు, తన ఇంట్లో పని చేసే సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు సీఎంకు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి , రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపారు.


నూతన సంవత్సరములు పురస్కరించుకొని సోమవారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు, అర్చక బృందం ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళ సై దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు


ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్ లో సీఎం దంపతులు!


హైదరాబాద్ బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ లో జరిగిన నూతన సంవత్సర వేడుకలలో అర్ధరాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. వైఎస్ అధికారులు వారి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా సీఎం దంపతులు గడిపారు.

సీనియర్ ఐఏఎస్ మాజీ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ సీఎం రేవంత్ రెడ్డి భుజం తట్టి అభినందించారు.


సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పనిచేసే సిబ్బంది సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వారితో సీఎం ఫోటోలు దిగారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ వారి నివాసంలో ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్ర రావు మర్యాదపూర్వకంగా కలిశారు.


డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ని

మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అటవీ & పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలసి

నూతన సంవత్సర ఆయన నివాసంలో పనిచేసే సిబ్బంది మంత్రులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.