సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ !

J.SURENDER KUMAR,

మలిదశ రాష్ట్ర సాధన ఉద్యమంలో, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి తన ప్రాణాలను అగ్నికి ఆహుతి చేస్తూ జై తెలంగాణ నినాదంతో రాష్ట్ర సాధన ఆకాంక్ష ఎంత బలంగా ఉందో సీమాంధ్ర ప్రభుత్వానికి ప్రత్యక్షంగా చూపించి అమరుడైన శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది.

మంగళవారం ఆమె డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించింది. ఈ సందర్భంగా ఆమె యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.