మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి !
J.SURENDER KUMAR ,
2022 – 23 వానాకాలం, యాసంగి, పెండింగ్ సీఎంఆర్ రైస్ డెలివరీ, రేషన్ బియ్యం రీసైక్లింగ్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, పెండింగ్ ధాన్యం కొనుగోలు గురించి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. నిర్దేశిత గడువు జనవరి 31 లోగా సీఎంఆర్ రైస్ సరఫరా పూర్తయ్యేలా చూడాలని, రేషన్ రీసైక్లింగ్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పెండింగ్ ఉన్న వానాకాలం ధాన్యం కొనుగోలును త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సచివాలయం నుంచి ప్రజాపాలన దరఖాస్తుల ఆన్ లైన్ నమోదు వంటి పలు అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశాలు జారీ చేశారు.
ప్రజాపాలన దరఖాస్తులు ఆన్ లైన్ లో నమోదు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర రావు, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ హతిరాం , జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నరేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.