కాంగ్రెస్, బీఆర్ఎస్ బాయి బాయి !

👉 జగిత్యాల జిల్లా ఆదర్శం !

J.SURENDER KUMAR,

ఎన్నికల వరకే పార్టీల జెండాలు వేరు  ప్రాంతల అభివృద్ధిలో ఎజెండా ఒక్కటే అనే నినాదం అక్షరాలుగా ఆచరించి రాజకీయ చరిత్రలో ఆదర్శంగా అగుపించిన అపూర్వ దృశ్యం జగిత్యాల జిల్లాలో శనివారం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది.

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ (బీఆర్ఎస్ ) నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం భూమి పూజల కార్యక్రమానికి  పట్టభద్రులుఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (కాంగ్రెస్)  జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత (బీఆర్ఎస్), ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ( కాంగ్రెస్)
సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లె, దర్మనాయక్ తండ, కోనాపూర్ , పెంబట్ల గ్రామలకు చెందిన నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం, కార్యాలయ భవనాలకు సంబంధించిన భూమిపూజ తదితర అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.