కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వము అర్హులైన వారికి సంక్షేమ పథకాలు!

ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీల ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని అర్హులైన ప్రతి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి మండలం జైన, దోంతపూర్ గ్రామంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో శుక్రవారం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తో పాల్గొన్నారు.
దొంతపూర్ గ్రామానికి సంబందించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, ధర్మపురి ప్రజానీకానికి ఎటువంటి సమస్యలు ఉన్న నేరుగా తనని కలువవచ్చని, దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు

.


అనంతరం ధర్మపురి మండలానికి చెందిన కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ మరియు అంగన్వాడి పిల్లల అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
దొంతపూర్ గ్రామానికి సంబందించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని,

ధర్మపురి ప్రజానీకానికి ఎటువంటి సమస్యలు ఉన్న నేరుగా తనని కలువవచ్చని, దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.


ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బత్తిని అరుణ, జైన సర్పంచ్ మహేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీపీ చిట్టిబాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగణబట్ల దినేష్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహ రాజు ప్రసాద్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు కుంట సుధాకర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాందెని మొగిలి, టౌన్ యూత్ అధ్యక్షులు తిరుపతి, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, లక్ష్మణ్, సాయి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు