దావోస్​లో భారతీయ దిగ్గజ సంస్థల ఛైర్మన్‌ల తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ !

👉సీఎంఓ కార్యాలయ ప్రకటనలో..

J.SURENDER KUMAR,

దావోస్​లో మూడో రోజు పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి  బృందం భారతీయ కంపెనీల ఛైర్మన్లతో భేటీ అయింది. వీరిలో టాటా, అదానీ, జేఎస్‌డబ్ల్యూ తదితర కంపెనీల ఛైర్మన్లు, ప్రతినిధులు ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా మూడో రోజు ప్రముఖ భారతీయ దిగ్గజ సంస్థల ఛైర్మన్‌లు, ప్రతినిధులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. తొలుత టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై టాటా ప్రతినిధులతో చర్చించారు. ‌

అనంతరం అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్ సజ్జన్ జిందాల్‌తో రేవంత్ రెడ్డి విడివిడిగా భేటీ అయ్యారు. తెలంగాణలో ₹12,400 కోట్ల పెట్టుబడులకు అదానీ గ్రూప్ నాలుగు ఒప్పందాలు చేసుకుంది. మరోవైపు గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్‌తోనూ సమావేశమయ్యారు. వీఆర్‌ఎల్‌డీసీ ప్రతినిధులతో చర్చించారు. సీఎం బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్‌ తదితరులు ఉన్నారు.