దేశ అభివృద్ధిలో గ్రామాలే కీలక పాత్ర !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్..

J.SURENDER KUMAR,

దేశ అభివృద్ధిలో గ్రామపంచాయతీలే కీలకమని స్థానిక సంస్థల బలోపేతానికి నేరుగా నిధులు విడుదలకు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయం లో చట్టాలకు రూపకల్పన జరిగిందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి యోజకవర్గం పెగడపల్లి మండలం బతికేపల్లి నూతన గ్రామపంచాయతీ భవనం సోమవారం పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ప్రభుత్వ పాలనలో గ్రామపంచాయతీ బలోపేతానికి తీసుకున్న చర్యలు వివరించారు.


జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శోభారాణి,ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మండల ప్రజా ప్రతినిధులు ఎంపీపీ జడ్పిటిసి ఎంపిటిసిలు సర్పంచులు వివిధ శాఖ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.