దేవాలయ టూరిజం ప్రత్యేక సర్క్యూట్ నుఏర్పాటుకు కృషి చేస్తాం!

👉మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ !

J.SURENDER KUMAR,

దక్షిణ కాశీ గా పేరుగాంచిన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయ అభివృద్ధి తోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి వేములవాడ, ధర్మపురి , కొండగట్టు , కాళేశ్వరం ను కలుపుతూ ఆధ్యాత్మిక దేవాలయ టూరిజం ప్రత్యేక సర్క్యూట్ ను ఏర్పాటు చేయుటకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు.

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం లో వారం రోజులపాటు నిర్వహించిన చతుర్వేద పారాయణ హోమ మహాపూర్ణాహుతి కార్యక్రమానికి స్ధానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, MLC జీవన్ రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.

అనంతరం మంత్రులు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ర్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకొనే విధంగా ఆ భగవంతుడు ప్రభుత్వానికి ఆర్ధిక పరిపుష్టి ని , శక్తి సామర్థ్యాలు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకున్నట్లు వారు తమ ప్రసంగంలో పేర్కొన్నారు.
👉ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మమ్మల్ని భాగస్వాములు చేయడం సంతోషం!
స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక శ్రద్ధతో గత వారం రోజులుగా ఆలయంలో నిర్వహిస్తున్న వేద పారాయణం, మరియు హవనం కార్యక్రమంలో తమను భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, మంత్రులు శ్రీధర్ బాబు కొండా సురేఖ లు అన్నారు.

ధర్మపురికి సంబందించిన పలు అభివృద్ధి పనులు, సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని, ధర్మపురినీ టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రులు ప్రకటించారు.

👉మంత్రుల సహకారంతో.. వేద కార్యక్రమం నిర్వహించాము. ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

ధర్మపురిలో వేద పారాయణం నిర్వహించాలని వేద పండితులు సంకల్పించి పేద సభ నిర్వహణకు సహకరించాలని కోరారు అని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు. నేను మంత్రి శ్రీధర్ బాబు, మరియు మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారికి సమావేశం వివరించానన్నారు. మంత్రులు సైతం వేద సభ నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చి నాకు సహకరించారు అంటూ వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
👉నా పూర్వజన్మ సుకృతం..
గత వారం రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో వేద పారాయణం హవనం నిర్వహించడం జరిగిందనీ, స్థానికులు ధర్మపురి నియోజకవర్గ ప్రజలు, ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నానని, ఇంత పవిత్రమైన హోమ కార్యక్రమం నా ఆద్వర్యంలో నిర్వహించడం నా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నామని,

ధర్మపురినీ టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని, నైట్ కాలేజ్ లో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని, ధర్మపురి ప్రజలకు శాశ్వత త్రాగు నీరు అందించే విషయంలో వాటర్ గ్రిడ్ నీ ఏర్పాటు చేయాలని, ఆలయానికి అనుబంధంగా వేద పాఠశాల ఏర్పాటు చేయాలని, ఆలయంలో ఋగ్వేదం వేద పండితుడిని, అదనంగా మంగళ వాయిద్యాలు కారులను,

నియమించాలని, మార్చిలో జరగనున్న జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ ఉంచి కోటి రూపాయలు నిధులు కేటాయించాలని, తదితర అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ వినతి పత్రం ఇచ్చారు.


నరసింహుని దర్శించుకున్న మంత్రులు!


ఆలయ సాంప్రదాయం పద్ధతిలో మంత్రులు శ్రీధర్ బాబు కొండా సురేఖ లకు దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులకు ఆలయ పక్షాన స్వామి వారి ప్రసాదం శేష వస్త్రం చిత్రపటాన్ని వారికి అందించి ఘనంగా ఆశీర్వదించారు.