👉 ఈనెల 18 నుంచి ఏడు రోజులపాటు!
J. SURENDER KUMAR ,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఈనెల18 నుండి 24 వరకు శ్రీ ప్రేమికవరద వేదపరిపాలన సభ, హైదరాబాద్ వారి ఆధ్వర్యములో జరుగునున్నది.
గతములో మంగళగిరి, వేదాద్రి, సింహచలం తదితర నారసింహ క్షేత్రములలో నిర్వహించిన విధముగా 21 మంది వేదపండితులచే సంపూర్ణ కృష్ణయజుర్వేద క్రమపారాయణం, సంపూర్ణ ఋగ్వేదహవనము, సంపూర్ణ సామవేదపారాయణం (ప్రతి రోజు ఉదయం, సాయంత్రం) మరియు చివరి రోజు తేది: 24-01-2024 రోజున “మహాపూర్ణాహుతి” కార్యక్రమము నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నారు.

లోక కళ్యాణార్థం నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ, విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయలు మంజూరు చేయించారు.
పూర్ణావతి కార్యక్రమానికి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పలువురు శాసనసభ్యులు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.