👉 వారం రోజులపాటు జరగనున్న సభ !
👉పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J. SURENDER KUMAR ,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం గురువారం నుండి వారం రోజులపాటు. జరగనున్న శ్రీ ప్రేమికవరద వేదపరిపాలన సభ, ప్రారంభమైంది. పూజాది కార్యక్రమాన్ని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ, విప్ ఏ. లక్ష్మణ్ కుమార్, వేద పండితులకు సంభావన ఇచ్చి సాంప్రదాయ వస్త్రధారణతో పాల్గొన్నారు.

గతంలో మంగళగిరి, వేదాద్రి, సింహచలం తదితర నారసింహ క్షేత్రములలో నిర్వహించిన తరహాలో 21 మంది వేదపండితులచే ‘సంపూర్ణ కృష్ణయజుర్వేద క్రమపారాయణం’ , ‘సంపూర్ణ ఋగ్వేదహవనము’, ‘సంపూర్ణ సామవేదపారాయణం ‘ (ప్రతి రోజు ఉదయం, సాయంత్రం) మరియు ఈనెల 24 న “మహాపూర్ణాహుతి” కార్యక్రమముతో వేద సభ ముగుస్తుంది.

ఆలయ వేద పండితుడు రమేష్ శర్మ, కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, రేషన్ కమిటీ చైర్మన్ ఐ రామయ్య, ఆలయం పాలకవర్గ మాజీ చైర్మన్ సంఘనపట్ల దినేష్, బ్రహ్మ సంఘ కార్యదర్శి నందగిరి గిరిధర్, మాజీ వార్డు సభ్యుడు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
లోక కళ్యాణం కోసం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతాంగం, ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం గడపాలని కోరుతూ. మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించాలని ప్రార్థిస్తూ. ‘శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలన సభ’ పూజాది కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు. ఎమ్మెల్యే తెలిపారు.

పూర్ణావతి కార్యక్రమానికి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పలువురు శాసనసభ్యులు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.
