ధర్మపురి క్షేత్రంలో జై శ్రీరామ్ నినాదాలతో బైక్ ర్యాలీ !

👉ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!

J.SURENDER KUMAR,

ధర్మపురి క్షేత్రంలో జై శ్రీరామ్ నినాదాలతో సోమవారం బైక్ ర్యాలీ నీ నిర్వహించారు. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మునిసిపల్ చైర్ పర్సన్ సంఘీ సత్యమ్మ జండా ఊపి ప్రారంభించారు.


అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిస్టాపన సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో హిందూ ఐక్యవేదిక నాయకులు కార్యకర్తలు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్వయాన ద్విచక్ర వాహనం నడుపుతూ ర్యాలీలో పాల్గొనడంతో బిజెపి, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, హిందూ ఐక్యవేదిక నాయకులు కార్యకర్తలు క్షేత్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


శివాజీ విగ్రహం నుండి, అంబెడ్కర్ చౌరస్తా, పటేల్ చౌరస్తా, బ్రాహ్మణ సంఘం, అంబెడ్కర్ విగ్రహం, గాంధీ చౌరస్తా, నంది చౌరస్తా మీదుగా దేవాలయం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

అనంతరం శివాలయాన్ని దర్శించుకొని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.
హనుమాన్ వాడలోని హనుమాన్ ఆలయంలో జరిగిన భజన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
అయోధ్యలో బాల రాముడు ప్రతిష్ఠాపన సందర్బంగా హిందూ ఐక్య వేదిక ఆద్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ధర్మపురి టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని, స్థానిక శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ ఆలయంలో వారం రోజులుగా జరుగుతున్న ‘శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలన సభ ముగింపు సందర్భంగా ఈనెల 24 న జరుగు పూర్ణహుతిలో కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యే కోరారు.

ధర్మపురి ప్రజలుకు ఏ సమస్య గూర్చి అయినా నేరుగా తన వద్దకు వచ్చి చెప్పవచ్చు అని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగన బట్ల దినేష్, మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ , ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రామన్న, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింహ రాజు ప్రసాద్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొగిలి, స్థానిక మున్నూరు కాపు సంఘ పట్టణ అధ్యక్షుడు రాజేష్, ఆలయ మాజీ ధర్మకర్త గడిపల్లి సత్యనారాయణ, హిందు ఐక్యవేదిక నాయకులు, కర్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


రామాలయంలో విశేష పూజలు!


గోదావరి నది తీరంలో గల స్థానిక శ్రీ రామాలయంలో అయోధ్య ప్రతిష్టా సందర్భంగా స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలను వంశపార్యం అర్చకుడు తాడూరు రఘునాథ్ శర్మ నిర్వహించారు.

మండలంలోని రాజారాం, దొంతపూర్, తిమ్మాపూర్, తదితర రామాలయాలలో రామచంద్ర మూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.