ధర్మపురిలో మంత్రులు శ్రీధర్ బాబు కొండా సురేఖల కు ఘన స్వాగతం !

J.SURENDER KUMAR,

మహా పూర్ణాహుతి కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులు శ్రీధర్ బాబు కొండా సురేఖలకు ధర్మపురి లో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.


శ్రీధర్ బాబు ను రాయపట్నం వద్ద ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ శాలువా కప్పి పుష్పగుచ్చని స్వాగతించారు. కాంగ్రెస్ శ్రేణులు వందలాది ద్విచక్ర వాహనాల తో భారీ ఎత్తున స్వాగతించారు. జగిత్యాల మార్గం గుండా ధర్మపురికి చేరుకున్న మంత్రి కొండా సురేఖకు స్థానిక వివేకానంద విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు కండువా కప్పి స్వాగతించారు. మంత్రి సురేఖను కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు లక్ష్మీనరసింహ గార్డెన్ వద్ద ఘనంగా స్వాగతించారు.

ఇద్దరు మంత్రులను ఊరేగింపుగా అంబేద్కర్ చౌరస్తా, హనుమాన్ వాడ, నంది విగ్రహం గుండా ఆలయానికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మంత్రులను, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఘనంగా స్వాగతించారు.

ఆలయ అధికారులు మేళా తాళాలతో మంత్రులకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు పూలమాలలు వేసి మంగళ వాయిద్యాలు మేళ తాళాలతో వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.