ధర్మపురిలో నామరూపాలు కోల్పోయిన నాగమయ్య ఆలయం!

👉ధర్మపురి ఆలయ అభివృద్ధికి కోట్లాది రూపాయల ఎక్కడ ? ఎక్కడి పనులు అక్కడే !

👉పూర్తికాని నిర్మాణాలు పట్టించుకోని దేవాదాయ శాఖ!

👉గత ప్రభుత్వం ప్రకటించిన ₹100 కోట్లు ఎక్కడ

👉స్వామివారి బ్రహ్మోత్సవాల ఆరంభానికి నెల రోజుల సమయం !

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం గత ప్రభుత్వ అధినేత కేసిఆర్ సీఎం హోదాలో ప్రకటించిన ,₹100 కోట్ల రూపాయల నిధులు హామీ ఏమైందో తెలియడం లేదు. ఆధునిక తరహాలో ఆలయ నిర్మాణం చేస్తామంటూ అధికారులు కూల్చిన నాగమయ్య గుడి నామరూపాలు కోల్పోయింది..

నాగమయ్య గుడి

గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరంభించిన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పట్టణ నడి బొడ్డును గల మహాన్విత మహిమగల నాగమయ్య గుడినీ కూల్చి సంవత్సర కాలం గడిచిన ఆ గుడి నిర్మాణం చేపట్టకపోవడంతో అక్కడి గుడి ఉనికి నామరూపాలు లేకుండా పోయింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. ఆరంభానికి కేవలం నెలరోజుల సమయం మాత్రమే ఉంది. ఆలయ పనులు అసంపూర్తిగా పనులు నిలిచిపోవడంతో భక్తజనం మనస్థాపం చెందుతున్నారు.

పుట్ట బంగారు మంటపం


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిని ప్రభుత్వం ₹ 100 కోట్ల నిధులతో చేపడతామని, గత పది సంవత్సరాల కాలంలో మాజీ సీఎం కెసిఆర్ శాసనసభలోను , అనేక సందర్భాలలో బహిరంగంగా ప్రకటించారు. నిధులు ఎన్ని వచ్చాయో ,? రాలేదో ? తెలియదు కానీ, క్షేత్ర నడి బొడ్డున గల నాగమయ్య గుడిని కూల్చిన ఆలయ అధికారులు నేటికీ నిర్మాణం పూర్తి చేయలేదు. నాగమయ్య విగ్రహం వర్షానికి తడుస్తూ ,ఎండకు ఎండుతూ ఉంది తప్ప అక్కడ గుడి అనే ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఆ గుడిని దేవస్థానం వారు నిర్మించింది కాదు, ఆ గుడి దేవాదాయ శాఖ పరిధిలోకి రాదు.

32 గదుల వసతి గృహం అసంపూర్తి పనులు

స్థానిక దాత స్వర్గీయ కొరిడే సదాశివ శాస్త్రి, తన సొంత డబ్బులతో గుడిని నిర్మించాడు. ఆ గుడి దేవాదాయ శాఖ పరిధిలో లేదు. అయినా దాత కుటుంబ సభ్యుల, భక్తుల అభిప్రాయం ప్రమేయం లేకుండా దేవాదాయ శాఖ అధికారులు కూల్చివేశారు. నాగుల చవితి, నాగుల పంచమి పర్వదినం రోజున మహిళా భక్తులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.

పూర్తికాని దుకాణాల సముదాయం !


స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభానికి పుట్ట బంగారం అనే కార్యక్రమం నిర్వహిస్తారు. అక్కడ స్వామివారి ఆశీనులవుతారు. అక్కడ చేపట్టిన మంటప నిర్మాణం సంవత్సర కాలంగా పూర్తి కాలేదు. స్థానిక బస్టాండ్ దగ్గర 32 గదులుగల లక్ష్మి నరసింహ వసతి గృహం పై అదనపు గదుల నిర్మాణం పనులు ప్రారంభించారు. సంవత్సర కాలమైన పనులు పూర్తి కాలేదు. నిర్మితమై ఉన్న గదులను భక్తులకు అందుబాటులో ఉందో ? లేదో ? తెలియని దుస్థితి.
టెలిఫోన్ ఎక్స్చేంజ్ సమీపంలో చేపట్టిన దుకాణాల సముదాయం నిర్మాణం నత్త నడక నడుస్తున్నది. స్థానిక లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జనరేటర్ రూమ్ దగ్గర పురాతన బావిని పూడ్చారు. అక్కడ హోమశాల నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. సంవత్సర కాలం గడిచిన నేటికీ పూర్తి కాలేదు. ఇదిలా ఉండగా మార్చి మాసంలో ధర్మపురి స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నయి.

ఆలయంలో ప్రారంభం కానీ హోమశాల నిర్మాణం

దాతల విరాళాలతో శివాలయం అభివృద్ధి!

స్థానిక లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలో గల అతి పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి (శివాలయం). ఆలయం, భక్తుల విరాళాలు దాదాపు ₹40 లక్షల నిధులతో, అందంగా రూపుదిద్దుకోంది. ( వెండి మంటపం, స్వామివారి కళ్యాణ వేదిక, హోమశాల, ఈశాన్య గణపతి. ఆలయ ఆధునికరణ, శివాలయంలో గ్రానైట్ ) తదితర పనులతో పాటు. కోతుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్ సైతం ఏర్పాటు చేశారు.

ఆలయం ముందు వాహనాల పార్కింగ్ తో స్థానికులకు, భక్తులకు ఇబ్బందులు!

అధికారులు నిర్లక్ష్యం వల్ల భక్తుల వాహనాలు. నేరుగా ఆలయం ముందు రావడం వారి దర్శనం వరకు పార్కింగ్ చేసుకోవడంతో పాటు, ఆలయ అధికారులు ఆలయం ముందు ఇనుప వారి గేట్లు పెట్టడంతో స్థానికులు అష్ట కష్టాలు పడుతున్నారు. బ్రాహ్మణ సంఘ భవనం వైపు, గోదావరి నది వైపు స్థానికులు కాలినడకన కూడా రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. స్థానికులు సొంత వాహనాలను సుదూరంలో పార్కింగ్ చేసుకుని పిల్లాపాపలతో లగేజ్ తోఇళ్లకు చేరవలసిన దుస్థితి. అత్యవసర సమయంలో, అంబులెన్సులు ఆటోలు కూడా ఈ ప్రాంతాలకు రాలేని దుస్థితి. దీనికి తోడు పదుల సంఖ్యలో రాజగోపురం ముందు ఉండే యాచకులు, రోడ్డు మధ్య వరకు కొబ్బరికాయల, బొమ్మల దుకాణాలను పెట్టడంతో ఇసుక స్తంభం వరకు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతున్నది. స్థానికుల భక్తుల ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదా ? లేక వాహనాల నియంత్రణ పట్ల నిర్లక్ష్యమా ? తెలియదు కానీ భవిష్యత్తులో భక్తులకు, ఆ ప్రాంత స్థానికులకు గొడవలు జరిగి శాంతి భద్రతల సమస్యగా మారనున్నది.. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని నిలిచిన ఆలయ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి, ఆలయం ముందు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని స్థానికులు భక్తజనం కోరుతున్నారు.