ధర్మపురిలో వైభవంగా గోదారంగనాథుల స్వామి వారి కళ్యాణం !

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో గల శనివారం శ్రీ శేషప్పకళావేదికపై శ్రీ గోదారంగనాథులస్వామి వారి కళ్యాణం శ్రీ స్వామివారి నిత్యకళ్యాణ మహోత్సవం స్వస్థి పుణ్యాహవాచనం శ్రీపురుషసూక్తం , లక్ష్మీ సూక్తం తో అభిషేకం హారతి మంత్రపుష్పం కార్యక్రమంలు అత్యంత వైభవంగా జరిగింది.

ఇట్టి కార్యక్రమం లో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్ , ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, రెనవేషన్ కమిటి సభ్యులు ,అర్చకులు నంభి అరుణ్ కుమార్, నేరెళ్ల సంతోష్ కుమార్, సూపరింటెండెంట్ కిరణ్, అర్చకులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

స్వామిని దర్శించుకున్న దేవాదాయశాఖ కమిషనర్ !


రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనర్ V. అనీల్ కుమార్ కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకున్నారు .
వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో మేళతాళాలతో స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేష వస్త్రం ప్రసాదం ఇచ్చి సన్మానించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం

కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ , ప్రవీణ్ కుమార్, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు ,ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు , సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్,అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్ ,సంపత్ కుమార్ ,అర్చకులు నంభి నరసింహ మూర్తి ,అశ్విన్ కుమార్ పాల్గొన్నారు.
అనంతరం కమిషనర్ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.