👉 “ నాన్నకు.. ప్రణతి ” పుస్తకావిష్కరణ సభలో…
👉 ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
స్వాతంత్ర సమరయోధులు, వేద పండితులు, రచయితలు, కళాకారులు, ప్రముఖులు పుట్టినిల్లు ధర్మపురి గడ్డ అని, ఆధ్యాత్మిక ప్రవచనాలతో, ప్రముఖ పుణ్యక్షేత్రల కు కొలువైన ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను విజయం సాధించడం నా పూర్వజన్మ సుకృతం అని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి క్షేత్రంలో కర్నె అక్క పెళ్లి కళ్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మాజీ మంత్రి స్వర్గీయ కెవి కేశవులు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన జీవిత చరిత్ర ను ‘నాన్నకు ప్రణతి’ అనే పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
నిజాం పాలనకు వ్యతిరేకంగా, గ్రామాల్లో నాటకాలు, ఉపన్యాసాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసారనీ అన్నారు. 1972, 1978 సిర్పూర్ నుండి MLA గా గెలిచి నాటి ముఖ్యమంత్రి P. V. సరసింహరావు మంత్రివర్గంలో మంత్రిగా పని పనిచేసిన అటువంటి గొప్ప వ్యక్తి పుస్తకాన్ని తాను ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు.

స్వర్గీయ కెవి కేశవులు కూతురు పుస్తక రచయిత డాక్టర్ ప్రణతి, కృషి, ప్రేమ అభినందనీయం అన్నారు. కెవి కేశవులు కుటుంబ సభ్యులకు కోరిన విధంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. నేను ఎమ్మెల్యేను కాదు, ప్రజా సేవకుడను, సామాన్య కుటుంబం నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఎమ్మెల్యే అయిన వాడిని, నేను ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానో నేను ఆ స్థాయిని చూసుకుంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటానని, అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ల సహాయ సహకారాలతో అభివృద్ధి కోసం పాటు పడతాను అన్నారు.
స్థానిక శ్రీ లక్ష్మీనరసింహ నాటికల మండలి కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సంఘీ సత్యమ్మ, వార్డ్ కౌన్సిలర్ జక్కు పద్మా రవీందర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంఘనపట్ల దినేష్, కళా సమితి అధ్యక్షుడు గుండేటి రాజు, నాట్యమండలి కోశాధికారి కాకర దత్తాత్రేయ శర్మ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పెండ్యాల మహేందర్, కెవి కేశవులు కుమారుడు మురళి, కుటుంబ సభ్యులు, రిటైర్డ్ న్యాయమూర్తి రాజయ్య, DCMS చెర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, తదితరులు వేదిక పై కూర్చున్నారు.

డాక్టర్ ప్రణతి కృతజ్ఞతలతో కార్యక్రమం ముగిసింది. కార్యక్రమానికి ముందు ప్రముఖ గాయకులు గుండి శంకర్ శర్మ, పాలెపు చంద్రమౌళి, సంగనభట్ల సంజీవ్ కుమార్, కస్తూరి రామ్ కిషన్, ప్రముఖ హార్మోనియం వాయిద్య కారుడు కొంటికర్ల రామయ్య శర్మ, తదితరులు ఆధ్వర్యంలో సంగీత విభారి జరిగింది.