ధర్మపురి నరసింహుడి హుండీ ఆదాయం ₹ 54 లక్షలు!

J.SURENDER KUMAR,

ధర్మపురి  శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల ఆదాయం ₹ 54,21,314/-వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు.  మిశ్రమ బంగారం 90 గ్రాములు, మిశ్రమ వెండి 6 కిలోల 200, గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 31 వచ్చినట్టు వివరించారు.

గురువారం భారీ బందోబస్తు మధ్య కరీంనగర్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఏ చంద్రశేఖర్, రెనవేషన్ కమిటీ చైర్మన్  ఇందారపు రామయ్య, కమిటీ సభ్యులు శ్రీమతి గందె పద్మశ్రీనివాస్, అక్కెనపెల్లి సురేంధర్, శ్రీమతి ఇనగంటి రమావెంకటేశ్వర్ రావు,  గునిశెట్టి రవీంధర్ గార్లు, జగిత్యాల జిల్లా గ్రూప్ టెంపుల్ కార్యనిర్వహణాధికారి పి.వేణుగోపాల్, దేవస్థాన సూపరింటెండెంట్  డి.కిరణ్, ఉప ప్రధాన అర్చకులు  నేరళ్ళ శ్రీనివాచార్యులు, సీనియర్ అసిస్టెంట్ ఎ.శ్రీనివాస్,  మరియు జక్కు దేవేంధర్, కోశాధికారి, ఆర్యవైశ్య సంఘం, తిరుమల సేవా గ్రూప్ సభ్యులు, కరీంనగర్ మరియు ధర్మపురి, లక్షేటిపేట సేవకులు, ఇతరులు, యూనియన్ బ్యాంక్ ఇండియా మేనేజర్ & సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు దేవస్థాన అర్చకులు & సిబ్బంది, భక్తులు పాల్గోన్నారు.

👉యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్షాన
  స్టీల్ హుండీల సమర్పణ!

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు సుమారు రెండు లక్షల విలువగల రెండు స్టీల్ హుండీలను యూనియన్ బ్యాంక్ DGM  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కిగురువారం అప్పగించారు. బ్యాంక్ అధికారులకు. దేవస్థానం పక్షాన శ్రీ స్వామివారి శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం ఇచ్చి సన్మానించారు.
యూనియన్ బ్యాంక్ DGM  శంకర్ హేంబ్రం , జగిత్యాల జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పొన్నం వెంకట్ రెడ్డి , జగిత్యాల జిల్లా చీఫ్ మేనేజర్ సరల్ గుప్తా , ధర్మపురి యూనియన్ బ్యాంక్ మేనేజర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.