ధర్మపురి త్రాగు నీటి సమస్య పరిష్కారంకు కృషి చేసిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!

👉సోషల్ మీడియాలో సమస్యకు స్పందించిన ఎమ్మెల్యే !

J.SURENDER KUMAR,

ధర్మపురి పట్టణానికి యుద్ధ ప్రాతిపదికన తాగునీటి సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉందని, అధికారులు మీరు ఏం చేస్తున్నారో తెలియదు నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది, పట్టణానికి 48 గంటల్లో తాగునీటి సరఫరా కొనసాగాలని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ,లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

సోషల్ మీడియాలో పట్టణానికి తాగునీరు సరఫరా కావడం లేదంటూ నేటిజన్లు పోస్ట్ చేశారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేసి సమస్య ఏమిటి ? సాంకేతిక ఇబ్బంది ఏమిటి ? నిధుల అవసరమా ? అంటూ ప్రశ్నించారు.
అధికారులు ప్రశ్నించారు అధికారులు యుద్ధ ప్రాతిపదికన రెండు రోజులలో తాగునీటి సమస్య ను పరిష్కరించి నీరు అందిస్తామని ఎమ్మెల్యే కు హామీ ఇచ్చారు.

ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది శ్రమించి మండలంలోని కమలాపూర్ లో నిర్మితమై నిరుపయోగంగా ఉన్న ఫిల్టర్ బెడ్ కు మరమ్మత్తులు పూర్తి చేసి శుక్రవారం తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సంబంధిత శాఖ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

👉సాగునీటి సమస్యకు పరిష్కారం!

గత సంవత్సరం గోదావరి వరదల కారణంగా తిమ్మాపూర్ లిఫ్ట్ మోటర్లు నీటిలో మునిగి కాలిపోయిన లిఫ్ట్ మోటార్లను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ జోక్యం చూసుకొని యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయించడంతో సాగునీటి సమస్య పరిష్కారమైందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
గోదావరి నది లిఫ్ట్ ద్వారా తిమ్మాపూర్ బూరుగుపల్లి గ్రామాల భూములకు సాగునీరు అందకపోవడంతో సమస్యను రైతులు వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.


ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సకాలంలో లిఫ్ట్ మోటార్లను రిపేర్ చేపించి రైతులకు సకాలం సాగు నీరు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీటీసీ సభ్యుడు కాళ్ల సత్తయ్య, జిల్లా బిజెపి నాయకులు నల్మాసు వైకుంఠం, కాంగ్రెస్ నాయకుడు లింగాల హరీష్ గౌడ్ మోటార్లకు కొబ్బరికాయలతో పూజ చేసి నీటి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు డి ఈ, ఏ ఈ, జే ఈ లు, లిఫ్ట్ కమిటీ ఛైర్మన్, సభ్యులు స్థానిక రైతులు తోడేటి ప్రకాశ్, తిరుపతి, లచ్చన్న, సంతోష్, రాయ నర్సు శ్రీనివాస్, సత్తయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.