👉కాసెట్టివాడ యూత్ ఆధ్వర్యంలో…
J. SURENDER KUMAR,
ధర్మపురి పట్టణం కాశెట్టివాడకు చెందిన క్రికెట్ టీం సభ్యులు నలుగురు వివిధ సందర్భాల్లో అకాల మృత్యువాత పడిన వారి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ప్రారంభమైంది.

స్వర్గీయ చెరుకు రాజన్న (బెదడే), బొంబాయి తిరుపతి, శీలం రాజు, న్యాయవాది సత్యనారాయణ ల స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను కాసెట్టివాడ యూత్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రారంభమైంది.. మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, జర్నలిస్ట్ సంగనపట్ల రామకృష్ణయ్య, టోర్నమెంట్ ను ప్రారంభించారు.