ధర్మపురి క్షేత్రంలో ఘనంగా శ్రీరామ్ అక్షింతల పంపిణీ !

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లో ఘనంగా ఆదివారం అయోధ్య శ్రీరామ చంద్ర మూర్తి అక్షింతల పంపిణీ కార్యక్రమం జరిగింది.

తోట్లవాడ, నాయి బ్రాహ్మణవాడ, పద్మశాలి వాడ, మరియు పోచమ్మ వాడ లో అయోధ్య శ్రీరామచంద్రమూర్తి అక్షింతల ఇంటింటికి పంపిణీ చేశారు. క్షేత్రంలోని వివిధ వాడలలో మహిళలు మంగళహారతులతో అక్షింతలకు మంగళ వాయిద్యాలు మేళ తాళాలతో స్వాగతం పలికారు.

ఇంటింటికి వెళ్లిన నిర్వాహకులకు ఘనంగా స్వాగతించి అక్షింతలను భక్తిశ్రద్ధలతో పూజించి వాడ, వీధిలో ఊరేగింపులు నిర్వహించి జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగించారు.

శివారు గ్రామమైన తుమ్మనాల లో ఇంటింటికి అక్షింతలు వితరణ కార్యక్రమంలో తుమ్మె నాల ఎంపీటీసీ ఆకు బత్తిని తిరుపతి, ఉప సర్పంచ్ అప్పల మల్లేష్, నందయ్య స్వామి ,వార్డ్ సభ్యుడు యాదగిరి లావణ్య ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు