ఘనంగా భోగి తేరు ఊరేగింపు !

J.SURENDER KUMAR

సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఆదివారం భోగి తేరును ఘనంగా నిర్వహించారు.

జనవరి 14న భోగి పండుగ రోజు సాయంత్రం 5.30 నుంచి 7 గంటల మధ్య శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణ స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఆలయ అధికారులు పాల్గొన్నారు.