గ్రామాల్లో అయోధ్య ప్రతిష్ట ఉత్సవాల తీరుపై  ఇంటెలిజెన్సీ ఆరా !

J.SURENDER KUMAR,

అయోధ్య లో బాల రాముడి ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఉత్సవాల తీరుపై ఇంటిలిజెన్సీ విభాగం ఆరా తీస్తున్నారు.
వివరాలు సేకరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమా ? కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ఇంటలిజెన్సీ విభాగం నివేదిక అందించనున్నదా ? అనే అంశంలో స్పష్టత లేదు.

గ్రామాల్లో బిజెపి , ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొంటున్నారా ?  లేదా ? అనే సమాచారంతో బైక్ ర్యాలీల నిర్వహణ బాధ్యతలు చేపట్టింది ఎవరు ?  అనే సమాచారం , నిర్వహించిన సభలు, సమావేశాల, కార్యక్రమాలు, ఉత్సవాల్లో పాల్గొన్న వారి సంఖ్య వివరాలు సేకరించినట్టు సమాచారం.


సోమవారం ధర్మపురి పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కళ్యాణ వేదిక పై జరిగిన సమావేశంలో ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులు అదే వేదికపై ఉండి వివరాలు సేకరించారు. ఇదే తరహాలో  పట్టణ ప్రాంతాలు మండల కేంద్రాలలో వివరాలు సేకరించినట్టు సమాచారం. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు చేశారా ?  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వివరాలు సేకరించారా  ?  అనే అంశంలో స్పష్టత తెలియడం లేదు.