👉ప్రపంచ ఆర్థిక ఫోరం,రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం !
👉సీఎంఓ కార్యాలయ ప్రకటనలో..
J.SURENDER KUMAR,
హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం సీ ఫోర్ ఐఆర్ ఏర్పాటుపై ప్రపంచ ఆర్థిక ఫోరం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. హెల్త్, లైఫ్ సైన్సెస్‌కు సంబంధించిన సీ ఫోర్ ఐఆర్ బయో ఏషియా సదస్సు సందర్భంగా ఫిబ్రవరి 28న ప్రారంభం కానుంది. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన చేశారు.

ఈ కేంద్రాన్ని ప్రపంచంలో 19వది దీంతో పాటు హెల్త్, లైఫ్ సైన్సెస్ రంగంలో మొదటిది. హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీఫోర్ఐఆర్ ప్రారంభంతో ఫార్మా, మెడ్‌టెక్, బయోటెక్నాలజీ రంగాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెఫ్ దృక్పథం, లక్ష్యాలు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక ఫోరం, తెలంగాణ ప్రభుత్వం మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరిందన్నారు. నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచడం ద్వారా ప్రజల జీవితాలు బాగుచేయాలన్న ఆలోచనలతో వెఫ్ ప్రపంచ స్థాయిలో పని చేస్తుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 4 కోట్ల మందిపై దృష్టి కేంద్రీకరిస్తోందన్నారు. వెఫ్ భాగస్వామ్యంతో ప్రజారోగ్యంతో సాంకేతికత, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యాలను వేగంగా అందుకోవచ్చునని సీఎం అన్నారు. చిన్న పట్టణాలు, గ్రామాలకు సాంకేతికతతో కూడిన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారు.
ఐటి మంత్రి శ్రీధర్ బాబు !

హెల్త్ టెక్ రంగంలో తెలంగాణను ప్రపంచ గమ్య స్థానంగా మార్చటంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హెల్త్ టెక్, లైఫ్ సైన్సెస్ రంగానికి నాయకత్వం వహించేందుకు రాష్ట్రం ముందంజలో ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఉన్న సెంటర్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్‌కేర్ అధిపతి డాక్టర్ శ్యామ్ బిషెన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న సీఫోర్ఐఆర్ అందరికీ అందుబాటులో ఉండేలా సాంకేతిక విధానాలతో కూడిన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడంలో చొరవ చూపుతుందనే నమ్మకముందన్నారు.