J.SURENDER KUMAR,
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే తన సహచర ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలలోనే తుపాకితో కాల్చి చంపిన సంఘటన ఝార్ఖండ్ లో మంగళవారం జరిగింది.
అనంతరం తనను తాను కాల్చుకోవడానికి యత్నించగా తీవ్రంగా గాయపడ్డాడు. ఝార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో ఎస్పీ నాథూ సింగ్ మీనా కథనం మేరకు.. రాజధాని రాంచీకి 300 కిలోమీటర్ల దూరంలోని పోరైయాహత్ ప్రాంతంలోని అప్‌గ్రేడెడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముగ్గురు టీచర్లు పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం స్కూల్‌కు వచ్చిన వేరు పాఠశాల గదులలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు .
గాయపడిన ఉపాధ్యాయుడు తనతో తెచ్చుకున్న తుపాకీతో తన తోటి ఉపాధ్యాయులను కాల్చిచంపినట్లుగా ఎస్పీ నాథ్ సింగ్ మీనా తెలిపారు. మృతుల్లో మహిళ ఉపాధ్యాయురాలు ఉన్నట్టు ఎస్పీ వివరించారు. అనంతరం అదే తుపాకీతో నిందితుడు కాల్చుకోగా, తీవ్రంగా గాయపడినట్లుగా ఎస్పీ నాథు సింగ్ మీనా మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.