👉జగిత్యాల జిల్లాలో సీఎంఆర్ బకాయి 33 వేల క్వింటాలు ?
👉మరో నెల రోజులు సమయం ఇస్తారా ?
J.SURENDER KUMAR,
ప్రభుత్వానికి రైస్ మిల్లర్స్ అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) సమయం కేవలం 24 గంటలు, జగిత్యాల జిల్లాలో మిల్లర్లు అప్పగించాల్సిన బియ్యం దాదాపు 33 వేల క్వింటాళ్లు ఉన్నట్టు సమాచారం.
ఈనెల 24న జిల్లా అదనపు కలెక్టర్ లత, బకాయి పడిన 20 రా , 4 బాయిల్డ్ రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. 2022-23 వర్షాకాలం కు సంబంధించిన CMR చివరి తేదీ ఈనెల 31 అని స్పష్టం చేసింది.
గడువులోపు చెల్లించని రైస్ మిల్లర్స్ పై చట్టపరమైన క్రిమినల్ కేసులు మరియు రెవెన్యూ రికవరీ యాక్ట్ (RR Act )ద్వారా వారి ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు.
2022 – 23 వర్షాకాలం CMR 43.73 లక్షల టన్నులు..
రాష్ట్రవ్యాప్తంగా వర్షాకాలం 2022 -23 కు రా బాయిల్డ్ రైస్ మిల్లర్ లు ప్రభుత్వానికి 43.73 లక్షల టన్నుల CMR అప్పగించాల్సి ఉంది. గత ప్రభుత్వం లో.2022 అక్టోబర్ నుంచి 2023 నవంబరు మాసం నాటికి 24.50 లక్షల టన్నుల బియ్యం ప్రభుత్వానికి అప్పగించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో డిసెంబర్ 17 నుంచి జనవరి 27 వరకు 14.50 లక్షల టన్నులు CMR ప్రభుత్వం మిల్లర్ల నుంచి వసూలు చేసింది. మెదక్, వనపర్తి, సూర్యాపేట, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి జిల్లా నుండి దాదాపు 4.73 లక్షల టన్నుల CMR ప్రభుత్వానికి మిల్లరు చెల్లించాల్సి ఉంది.
సంబంధిత శాఖ కమిషనర్ మరో నెల రోజుల గడువు కోసం ప్రభుత్వానికి ఈ నెల 20న లేఖ రాసినట్టు వస్తాయి అధికార వర్గాలు చర్చించుకుంటున్నారు.
డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపు,
సీఎంఆర్ రా మిల్లర్ల నుంచి బాయిల్డ్ రైస్ మిల్లర్లకు పరస్పర బదలాయింపులలో సంబంధిత శాఖ జిల్లా అధికారులు పెద్ద మొత్తంలో మిల్లర్ల నుంచి లబ్ధి పొందినట్టు చర్చ జరుగుతుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు CMR ప్రభుత్వానికి కేటాయింపులో జాప్యం, రైస్ మిల్లర్స్ ధాన్యం అమ్ముకోవడం, గత వర్షాకాలం సీజన్ లో బకాయపడిన CMR ఈ సంవత్సరం అప్పగించడం, ఈ సంవత్సరానికి కేటాయించిన వరి ధాన్యం మిల్లులలో స్టాక్ పరిశీలించితే కొందరు అధికారుల అవినీతి భాగోతం వెలుగు చూస్తాయని బాధిత రైస్ మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు సంబంధిత శాఖ అధికారులతో కుమ్మక్కైన రైస్ మిల్లర్ల, విద్యుత్ వినియోగం, మీటర్ రీడింగ్ పరిశీలిస్తే బండారం బయటపడుతుందని కొందరు రైస్ మిల్లర్స్ ఆరోపిస్తున్నారు. దీనికి తోడు గత అసెంబ్లీ ఎన్నికలలో కొందరుఅధికార పార్టీ అభ్యర్థులకు విరాళాల పేరిట జిల్లాలో ఎవరికి.? ఎంత మొత్తంలో చెల్లించారో ? విజిలెన్స్ విచారణ జరిపితే అధికారుల, పైరవీకారుల, బాగోతం వెలుగు చూడనున్నట్టు చర్చ.