👉పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
ఇంటర్ బోర్డు కమిషనర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, జగిత్యాల జిల్లా కేంద్రంలో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని జీవన్ రెడ్డి అధ్యాపకులకు హామీ ఇచ్చారు.
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మూల్యాంకన కేంద్రాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని సోమవారం తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGJLA) 475 ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
నూతన జిల్లాలు ఏర్పడ్డాక పలు జిల్లాలలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూయేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారని జగిత్యాలలో ఏర్పాటు ఏర్పాటు చేయకపోవడంతో మూల్యాంకన విధులు నిర్వహించే అధ్యాపకులు కరీంనగర్ కు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలతో పాటు, ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన వసతులు ఉన్నాయని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు.
జీవన్ రెడ్డిని కలిసిన వారిలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొట్టాల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అత్తినేని శ్రీనివాస్, కోశాధికారి సిహెచ్ .జైపాల్ రెడ్డి, స్టేట్ కౌన్సిలర్ కే.శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు బి.శ్రీహరి, మహిళా కార్యదర్శి ఎం.శ్రీలత, అధ్యాపకులు పి.శ్రీధర్, ఎస్ .సునీత, వి.శిల్ప పాల్గొన్నారు.