కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది – మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ !


J.SURENDER KUMAR,

ఎన్నికలు జరుగుతునే ఉంటాయి. ఎన్నికలలో గెలుపు ఓటములు సర్వసాధారణం, ఏదో ఒక పార్టీ గెలవడం, అధికారంలోకి రావడం, ఆ పార్టీ ప్రజలకు అందించిన సేవలను గౌరవించడం సహజం. కార్యకర్తలు అధైర్య పడవద్దు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

శుక్రవారం ధర్మపురి నియోజకవర్గం ఉమ్మడి వెల్గటూర్ మండల కార్యకర్తల సమన్వయ సమావేశానికి ముఖ్యమంత్రి అతిధి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ..
కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందీ కలిగించాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు.
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసుల నుండి తమ పార్టీ కార్యకర్తలను అండగా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు కొప్పుల ఈశ్వర్ అన్నారు.
మన బిఆర్ఎస్ పార్టీ మాములు పార్టీ కాదు.., దేశంలో పెద్ద ఎత్తున సభ్యత్వం గల పార్టీ…
మీకు అందరికీ స్థానిక నాయకులు నేను మీ వెంట ఉంటామని, ఈ ధర్మపురి నియోజకవర్గం లో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వెంట ఉంటు, అండగా ఉంటామని కొప్పుల ఈశ్వర్ ధైర్యాన్ని ఇచ్చారు .
పరామర్శ!


ఎండపల్లి మండలం యం.పి.టి.సి బషీర్ తల్లి మహ్మద్ వొజ్రబి అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి, మాజీ మంత్రి సానుభూతి తెలిపారు.