👉పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో కెసిఆర్ తరహాలోనే దేశంలో ప్రధాని మోడీ పాలన కొనసాగుతున్నది. తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు తరహాలో రానున్న ఎన్నికల్లో దేశంలో పునరావృతం అవుతాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ పై రాళ్లతో దాడి చేసి అడ్డుకునే ప్రయత్నం చేసిన సంఘటనకు నిరసనగా సోమవారం సాయంత్రం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కొవ్వొత్తుల శాంతియుత ర్యాలీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ

..జాతీయ స్థాయిలో బీజేపీ కుల మతాల పేరిట విభేదాలు సృష్టిస్తున్న తరుణం లో మణిపూర్ హింస ఘటనపై కేంద్రం నిర్లక్ష్యం పట్ల మణిపూర్ నుండి రాహుల్ గాంధీ న్యాయ యాత్ర ప్రారంభించారు అని అన్నారు.
దేశంలో మణిపూర్ అంతర్బగాం అక్కడ జరుగుతున్న సంఘటనలు ప్రభుత్వం బాధ్యత కాదనాన్నట్లుగా వ్యవహరించడం దురదృష్టం అన్నారు. శ్రీ రామ చంద్రుని పట్ల భక్తి విశ్వాసలు ఉంటే ఆ పాలనా తలపించే విధంగా గౌరవ ప్రధంగా మోదీ పాలనా ఉండాలి అని జీవన్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గిరి నాగభూషణం, నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, దేవేందర్ రెడ్డి, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
ధర్మపురిలో….

రాహుల్ గాంధీ మీద జరిగిన దాడికి నిరసన గా సోమవారం ధర్మపురి పట్టణంలోనీ నంది చౌక్ నుండి గాంధీ వరకు క్యాండిల్ ర్యాలీ మండల కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది.
ఈ సంద్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగనభట్ల దినేష్ మాట్లాడుతూ మా ప్రియతమా నేత రాహుల్ గాంధీ దేశంలో బీజేపీ పార్టీ చేస్తున్న అన్యాయాల పై చెపట్టిన న్యాయ్ యాత్ర భాగంగా అస్సాం లో జరుగుతున్న యాత్ర పై అక్కడ ఉన్న బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ బీజేపీ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి రాహుల్ గాంధీ యాత్రను అడ్డుకోవడంమే కాకుండా అస్సాం PCC అధ్యక్షుడిపై పై భౌతిక దాడి చేయడం, రాహుల్ గాంధీ నీ గుడికి పోకుండా అడ్డుకోవడానికి నిరసనగా క్యాండిల్ ర్యాలీ చేపట్టినట్టు తెలిపారు.