కొండగట్టు ఆలయ హుండీ ఆదాయం ₹ 71 లక్షలు!

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి హుండీ ఆదాయం రోజుకు దాదాపు రెండు లక్షల చొప్పున ఆదాయం లభించింది.

బుధవారం ఆలయ ప్రాంగణంలో అధికారులు స్వచ్ఛంద సంస్థలు భారీ నిఘా నీడలో 35 రోజుల హుండీ ఆదాయం లెక్కించారు. ఇందులో ₹ 71,73,723/- ఆదాయం లభించినట్టు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

మిశ్రమ బంగారం వెండి తో పాటు విదేశీ కరెన్సీ నోట్లు హుండీలో వచ్చినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
హుండీ లెక్కింపులో ఎ. చంద్రశేఖర్, సహాయ కమీషనర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ, కరీంన గర్, అలయ కార్యనిర్వహణాధికారి టి. వెంకటేశ్ ఎ.ఈఓ బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్స్ శ్రీనివాస శర్మ, సునీల్ కుమార్, ఆలయ సిబ్బంది ఏ.ఎన్.ఐ. శ్రీనివాస్ మరియు హోంగార్డులు పాల్గొన్నారు.