👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
క్రీడలలో గెలుపోటములు సహజం, కానీ వీటి ద్వారా లక్ష సాధన కోసం యువతలో పట్టుదల పెరుగుతున్నది ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్మరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి మండలం రాయపట్నంలో కీ.శె గోళ్ళ కిషన్ (రెడ్డి) స్మారక వారి మిత్రబృందం ఆద్వర్యంలో క్రికెట్ టోర్నీని శనివారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
రాయపట్నం గ్రామస్తులు నన్ను కుటుంబ సభ్యుడిగా. ఆదరిస్తున్నారు అని అన్నారు. గెలుపొందిన తర్వాత మొదటి సారి క్రీడా కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని, నియోజకవర్గంలోని క్రీడాకారులకు ప్రభుత్వ తరపున అన్ని విధాల అండగా ఉంటామని, క స్టేడియం ఏర్పాటు కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తామని, క్రీడలకు కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. రాయపట్నం ప్రజలకు ప్రభుత్వం నుండి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనభట్లు దినేష్, నియోజక యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహ రాజు ప్రసాద్, మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొగిలి, శ్రీనివాస్,.టౌన్ యూత్ ప్రెసిడెంట్ తిరుపతి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు నర్సింహులు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీయోద్ధిన్, సుముక్, ఎంపిటిసి అంజి, దేవవరం, శరత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు