లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు!

J.SURENDER KUMAR,

ధర్మపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారం తో ఉచిత నేత్ర వైద్య శిభిరం ఏర్పాటు స్థానిక ఎస్ హెచ్ గార్డెన్స్ లో నిర్వహించారు.


ఈ శిభిరం ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సంగనపట్ల దినేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీమతి వేముల నాగలక్ష్మి ప్రారంభించారు. ఈ శిబిరంలో మూడు వందల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 80 మందిని మోతే బిందు కంటి పొరలు ఉన్నవారిని గుర్తించారు. వీరిలో 32 మందిని ఉచితంగా ఆపరేషన్లు చేయడానికి రెకుర్తి కి తరలించారు. మిగతా వారిలో 30 మందిని బుధవారం రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించనున్నారు.

ధర్మపురి లైన్స్ క్లబ్ క పక్షాన ఇప్పటివరకు 600 వందల మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేయించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి లయన్స్ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి సభ్యులు కార్యవర్గం పాల్గొన్నారు.