J.SURENDER KUMAR,
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్, బాపూఘాట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి తదితరులు. పాల్గొన్నారు.

కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాలు!

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నివాసంలో మంగళవారం అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సంగీత రెడ్డి. స్టార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం గోపీచంద్ గుడిపాటి రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.
గద్దర్ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయింపు!

ప్రజా యుద్ధ నౌక ‘గద్దర్’ విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మాణాన్ని హెచ్ఎండిఏ ఆమోదించింది. అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.