👉తెలంగాణ అడ్వకేట్ జనరల్ తో సమీక్ష !
J.SURENDER KUMAR,
ఎస్సీ వర్గీకరణ అంశంపై మంత్రి దామోదర్ రాజనరసింహ తో సోమవారం హైదరాబాద్ లో మాదిగ శాసనసభ్యులు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, (ధర్మపురి) కవ్వంపల్లి సత్యనారాయణ, (మానకొండూర్) .మందుల శ్యాముల్ (తుంగతుర్తి) సమావేశమయ్యారు.
మాదిగల చిరకాల వాంఛ, గత కొన్ని సంవత్సరాలగా ABCD వర్గికరణ పై జరుగుతున్న పోరాట నేపథ్యంలో ఈ నెల 17న సుప్రీంకోర్టులో ఈ అంశం విచారణకు రానున్నది.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించేందుకు సీనియర్ కౌన్సిల్ న్యాయవాధిని నియామకం గూర్చి సమావేశంలో చర్చించారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు సైన్స్ & టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్షన్ రెడ్డి తో ఎమ్మెల్యేల బృందం చర్చించారు.

ఈ సందర్భంగా దళిత జనాభా ప్రాతిపాదికన ABCD వర్గికరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పొందుపరచడం జరిగిందని ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవ సుప్రీం కోర్టు పైన తమకు పూర్తిగా నమ్మకం ఉందని దళిత వర్గంలోని మాదిగలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.