మా ప్రభుత్వంలో ప్రతి ఎకరాకు నీరు అందిస్తాం – ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,
మా ప్రభుత్వంలో ప్రతి ఎకరాకు  సాగునీరు  అందిస్తామని, ఎస్సారెస్పీ, వరద కాలువల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంటలు ఎండిపోకుండా చర్యల కోసం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ కలిసి చర్యలు చేపట్టనున్నట్టు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

మంగళవారం మల్యాల మండలం బూరుగుపల్లి, తాటిపల్లి, నందగిరి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (SRSP) లింక్ వరద కాలువలను  ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ…
ధర్మపురి నియోజకవర్గ రైతాంగం SRSP, వరద కాలువలు, మరియు వాటి తూముల మీద ఆధారపడి  పంటలు సాగు సాగు చేసుకుంటున్నారని అన్నారు. 

ఈ ప్రాంత రైతాంగానికి సాగు నీరు, త్రాగు నీరు అందించాలని  ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఆయనకు పరిస్థితి వివరించినట్టు తెలిపారు. సీఎం స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారని ఎమ్మెల్యే అన్నారు.  నేను ప్రతి పక్షంలో ఉన్నప్పుడు లింక్ 2 ద్వారా రాంగదాముని పల్లె చెరువు, జంగనాల ప్రాజెక్ట్ లను నీటితో నింపాలని  కోరిన గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

ఎమ్మెల్యే వెంట
పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు గౌడ్, వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి,   మరియు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు