ముగిసిన ఆండాళ్ నీరటోత్సవాలు !


J.SURENDER KUMAR,

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఏడు రోజుల పాటు జరిగిన ఆండాళ్ నిరటోత్సవం శనివారంతో ముగిసింది.
ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరి నీరట మండపానికి చేరుకుని తిరువీధుల్లో ఊరేగారు.

సాయంత్రం శ్రీ ఆండాళ్ బంగారు తిరుచ్చిపై శ్రీ కోదండరామాలయం చుట్టూ ఊరేగించి తిరిగి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయానికి చేరుకున్నారు.
ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో, శ్రీ ఆండాళ్ తన స్వామి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ పండుగను నిర్వహిస్తారు.


ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో  మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు  నారాయణ, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.